నలుగురు నిందితుల అరెస్ట్.. బర్రె, ఆటో, రూ.80 వేల నగదు స్వాధీనం!
తనిఖీల్లో దొరికిపోయిన ముఠా.. వివరాలు వెల్లడించిన సీఐ మన్మధకుమార్!
చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో వరుస బర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను చౌటుప్పల్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ జి. మన్మధకుమార్ తెలిపిన వివరాల ప్రకారం...మంగళవారం ఉదయం రెడ్డిబావి ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా వస్తున్న ఓ ఆటోను ఆపేందుకు యత్నించారు. పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, పలు చోట్ల పశువుల దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.కోదాడకు చెందిన అడ్డాడి రాఘవేంద్రరావు, అడ్డాడ శ్రీనివాసరావు, తంగడపల్లికి చెందిన దాసరి యాదయ్య, చిలుకూరు మండలం ఆర్లగూడెంనకు చెందిన ఆటో డ్రైవర్ చాపల సైదులు ముఠాగా ఏర్పడి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.వరుస చోరీలు.. ఆగస్టు 8 చౌటుప్పల్ రామ్‌నగర్ కాలనీలో 2 బర్రెలు, 3 దూడలను దొంగిలించి, అందులో ఒక బర్రె, 3 దూడలను విక్రయించారు.సెప్టెంబర్ 11కాటమయ్య కాలనీలో మరో బర్రెను ఎత్తుకెళ్లి కోదాడలో విక్రయించారు.
అక్టోబర్ 4 లింగారెడ్డిగూడెం శివారులోని షెడ్డు తాళాలు పగులగొట్టి బర్రెను దొంగిలించి, అటవీ ప్రాంతంలో దాచారు.మంగళవారం ఆ బర్రెను ఆటోలో కోదాడ సంతకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి ఒక బర్రె, ఆటో (TS 08 యు ఎ 3407), మొబైల్ ఫోన్లు, రూ.80,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠా చెప్పిన ఆధారాలతో గతంలో విక్రయించిన బర్రెలను కూడా రికవరీ చేసి,నిందితులపై కేసులు నమోదు (సి ఆర్ No: 559, 560, 561/2026) చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.గ్రామాల్లో, కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ మన్మధకుమార్ కోరారు. భద్రత నిమిత్తం తనిఖీలు, నిఘా తీవ్రతరం చేసినట్లు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి