చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ మండలం తంగడపల్లి శివారులోని పద్మావంశీ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.ఈ వేడుకకు మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ చెరుకు శివకుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామాల్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని ఆకాంక్షించారు. ఈ మహోత్సవంలో కాలనీవాసులు, భక్తులు, స్థానిక నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి