నియామక పత్రం అందజేసిన సంస్థ వ్యవస్థాపకుడు.
ఆవనగంటి సతీష్
ఎల్.బి.నగర్: అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆర్టీఐ రక్షక్ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం సంస్థ వ్యవస్థాపకుడు ఆవనగంటి సతీష్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించడం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే ఆర్టీఐ రక్షక్ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఐ కార్యకర్తలను సమన్వయం చేస్తూ, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు మరింత చేరువ చేసి, ప్రభుత్వ పాలనలో పారదర్శకత సాధించేందుకు కృషి చేస్తానన్నారు.
డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ నియామకంపై సంస్థ ప్రతినిధులు, సభ్యులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి