రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం జోగిపేట - ఆందోల్ ట్యాంక్ బండ్‌ను పరిశీలించారు.ముందుగా ట్యాంక్ బండ్ పరిసరాల్లో కలియదిరిగి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ట్యాంక్ బండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, సందర్శకులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం బతుకమ్మ కుంట, డోబిఘాట్, హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతాలను పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు.ప్రతిపాదిత టూరిజం హోటల్ నిర్మాణ ప్రాంతాన్ని కూడా మంత్రి పరిశీలించారు. టూరిజం అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని, పనులు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. చివరగా నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నర్సింగ్ కాలేజ్ భవనాన్ని పరిశీలించారు. బ్యాలెన్స్ పనులను శరవేగంగా పూర్తి చేసి,త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు.ఈ పర్యటనలో అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.
ఆందోల్-జోగిపేట ట్యాంక్‌బండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి