ముఖ్య అతిథులుగా మంత్రి టీజీ భరత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (తిరుమల గ్రూప్) ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తున్న కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రాజెక్టు ఛైర్మన్ కౌటికె విఠల్, కో-ఛైర్మన్ మడుపల్లి రవి గుప్తా, తిరుమల గ్రూప్ అధ్యక్షుడు సింగిరికొండ నరసింహ, నీలా ఉదయ్ చంద్‌లు పిలుపునిచ్చారు.ఈ వన సమారాధనలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జీవిత సభ్యులు పాల్గొనవచ్చని, ఆసక్తి గలవారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని రిజిస్ట్రేషన్ కమిటీ ఛైర్మన్ కౌటికె విఠల్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు జీవిత సభ్యత్వం లేని వారు నూతనంగా సభ్యత్వం పొంది, పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ఈ వేడుకలో భాగస్వాములు కావచ్చని సూచించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ, గౌరవ అధ్యక్షుడు టీజీ వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరవుతారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి