Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఏదుల నుంచే సాగునీరు అందించాలి

Updated : 15 Nov 2026 20:12 IST
As Preferred Source 1 min read
ఏదుల నుంచే సాగునీరు అందించాలి

​పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి

సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి డిమాండ్

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు ఏదుల రిజర్వాయర్ నుంచే సాగునీరు అందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చౌటుప్పల్‌లోని కళాశ్రీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన ఆయన, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి విలేకరులతో మాట్లాడారు.​పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను వెంటనే పూర్తి చేసి బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొందని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం, బీమా అందించడంతో పాటు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఉపాధి కల్పించాలని కోరారు. శివన్నగూడెం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు సాగునీరు అందించేందుకు రాచకొండలో రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌కు వెంటనే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, పల్లె శేఖర్ రెడ్డి, మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, నాయకులు టంగుటూరి రాములు, బత్తుల సుధాకర్, అంజయ్య, నీల బిక్షపతి, దాసరి మనోహర్, ఉబ్బు దర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఏదుల నుంచే సాగునీరు అందించాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news