వార్డు అధ్యక్షుడిగా సుర్వి నరేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా మారుపాక ప్రభాకర్ గౌడ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం 2వ వార్డు నూతన బూత్, వార్డు కమిటీలను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వార్డు అధ్యక్షుడిగా సుర్వి నరేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా మారుపాక ప్రభాకర్ గౌడ్ ఎన్నికయ్యారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనలు, డీసీసీ ఆదేశాల మేరకు మున్సిపల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోషిక వినయ్, పీఏసీఎస్ ఛైర్మన్ మస్తాన్ బాబు యాదవ్, వైస్ ఛైర్మన్ పర్నే శివారెడ్డి, రామాలయం ఛైర్మన్ బొబ్బిల మురళి, మాజీ పట్టణ అధ్యక్షుడు మొగుదాల రమేష్ గౌడ్, మున్సిపల్ మాజీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, నాయకులు బత్తుల విప్లవ గౌడ్, పందుల రాజేష్ గౌడ్, దుబ్బాక ఆకాష్ రెడ్డి, మున్సిపల్ కమిటీ సభ్యులు ఎర్రగొని లింగస్వామి యాదవ్, అంతటి బాలరాజ్ గౌడ్, వర్కాల వెంకటకుమార్, సయ్యద్ వయ్యూద్దీన్, మట్టపల్లి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి