భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన గొప్ప ఆదివాసి విప్లవీరుడు బ్రిటిష్ పాలకుల దోపిడి ఆదివాసుల భూముల ఆక్రమణ గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు భగవాన్ బిర్ష ముండ అని సంగారెడ్డి జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రామేశ్వరి దేవి అన్నారు చౌటాకూర్ మండల్ బొమ్మారెడ్డి గూడెం బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆదివారం నాడు నిర్వహించిన బిర్ష ముండ జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడుతూ గిరిజనులకు జల్ జంగిల్ జమీన్ నీరు అడవి భూమి హక్కులు ఉండాలని ఆయన పోరాటం చేశారు మనభూమిని మనం కాపాడుకోవాలి మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలి గిరిజనుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని విద్యా,చైతన్య, ఆత్మగౌరవంతో ముందుకు సాగాలని అన్యాయానికి భయపడకుండా ఎదురిండి నిలబడాలని ఆదివాసి సమాజాలకు బిర్ష ముండా సందేశాన్ని ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బొమ్మరెడ్డి గూడెం గ్రామ సర్పంచ్ జైపాల్ నాయక్, ఉప సర్పంచ్ రజనీ గోపాల్ వసతి గృహ అధికారి భవాని,వార్డు సభ్యులు గోపాల్,మేనక గణేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు, రఘు నాయక్,గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది స్వాతి,రవీందర్, ఎన్సీఐ అధికారి రమేష్, గిరిజన ఆశ్రమ పాఠశాల బోధన సిబ్బంది పాల్గొన్నారు,బిర్ష ముండ జయంతి సందర్భంగా లైవ్ టెలికాస్ట్ లో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సందేశాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు వీక్షించారు
బొమ్మ రెడ్డి గూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో భగవాన్ బిర్ష ముండా జయంతి వేడుకలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి