విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, వారి ఉన్నతికి పాఠశాల స్థాయి నుంచే బలమైన పునాది వేయాలని జెనిసిస్ వాలి స్కూల్ కరస్పాండెంట్ మిర్యాల దుర్గాప్రసాద్ అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ పరిధిలోని జెనిసిస్ వాలి స్కూల్‌లో నవంబర్ 14న వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ మిర్యాల దుర్గాప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యతో పాటు క్రమశిక్షణ, సృజనాత్మకత, నైతిక విలువలను పెంపొందించడం పాఠశాలల బాధ్యత అని పేర్కొన్నారు. చిన్నారులలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినప్పుడే వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి