Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

మధుమేహంపై అవగాహనతోనే ఆరోగ్యకరమైన జీవనం ఈబీఆర్ నర్సింగ్ హోమ్‌లో ఉచిత వైద్య శిబిరం.. 50 మందికి పరీక్షలు, మందుల పంపిణీ

Updated : 15 Nov 2026 10:03 IST
As Preferred Source 1 min read
మధుమేహంపై అవగాహనతోనే ఆరోగ్యకరమైన జీవనం ఈబీఆర్ నర్సింగ్ హోమ్‌లో ఉచిత వైద్య శిబిరం.. 50 మందికి పరీక్షలు, మందుల పంపిణీ

భువనగిరి, నవంబర్ 15: స్థానికం ప్రతినిధి:

ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరిలోని ఈబీఆర్ నర్సింగ్ హోమ్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈబీఆర్ నర్సింగ్ హోమ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 50 మంది పాల్గొని వైద్య సేవలను పొందారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిబిరం కొనసాగింది.

ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు, ఈబీఆర్ నర్సింగ్ హోమ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఈ. బలరాం మాట్లాడుతూ మధుమేహం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడంతో పాటు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయాలని తెలిపారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మధుమేహాన్ని గుర్తించి నియంత్రణలో ఉంచుకోవచ్చని పేర్కొన్నారు.

శిబిరంలో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఈ. బలరాం, స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ పి. అనురాధ వైద్య సేవలు అందించారు. మైక్రో ల్యాబ్స్ డీటీఎఫ్ డివిజన్ సహకారంతో ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించి, పరీక్షలు చేయించుకున్న వారికి మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మైక్రో ల్యాబ్స్ ప్రతినిధులు సాయికిరణ్, స్వస్తిక్, మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి