సిఆర్పిఎఫ్ అరుంధతి నగర్ మెయిన్ రోడ్డులో కొన్ని రోజుల క్రితం రోడ్డు పనులు చేస్తున్న డోజర్ తగిలి విద్యుత్ స్తంభం పూర్తిగా ఒరిగిపోయింది. ప్రస్తుతం ఆ స్తంభం ఏ క్షణంలోనైనా కూలిపోయే పరిస్థితిలో ఉంది.ఆ స్తంభానికి ఉన్న విద్యుత్ తీగలు కూడా వేలాడుతున్నాయి. దీని వల్ల ఆ రోడ్డులో వెళ్ళే పాదచారులకు, వాహనదారులకు, ముఖ్యంగా స్కూల్ కి వెళ్ళే చిన్న పిల్లలకు తీవ్ర ప్రమాదం ఉంది.ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు.
కావున మీరు వెంటనే స్పందించి, ప్రమాదం జరగక ముందే ఆ స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము.
ఒకవేళ ఆలస్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానికి సంబంధిత శాఖదే పూర్తి బాధ్యత.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి