Sthanikam - Truth Matters
Logo

ఎయిర్‌టెల్ టవర్లే టార్గెట్‌.. ఇంజినీర్ల ముఠా అరెస్ట్!

Updated : 15 Nov 2026 08:23 IST
As Preferred Source 1 min read
ఎయిర్‌టెల్ టవర్లే టార్గెట్‌.. ఇంజినీర్ల ముఠా అరెస్ట్!

తెలుగు రాష్ట్రాల్లో 38 చోరీలు.. రూ.1.62 కోట్ల విలువైన రేడియో రిమోట్ యూనిట్ల అపహరణ

రూ.25 లక్షల విలువైన మూడు కార్లు, రెండు బైకులు, రూ.15 లక్షల నగదు స్వాధీనం

నల్లగొండ సీసీఎస్ పోలీసుల ఘనత

నల్లగొండ, నవంబర్ 14: మొబైల్ టవర్లలోని ఖరీదైన రేడియో రిమోట్ యూనిట్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ఇంజినీర్ల ముఠా గుట్టును నల్లగొండ సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసిన ముగ్గురు ఇంజినీర్లు, ఆరుగురు ఇతర సిబ్బంది సహా మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు.

వీరు తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 38 చోరీలకు పాల్పడి సుమారు రూ.1.62 కోట్ల విలువైన యూనిట్లను అపహరించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.

నిందితుల నుంచి రూ.25 లక్షల విలువైన మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.15 లక్షల నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రివేళల్లో మొబైల్ టవర్ల వద్దకు చేరుకుని సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్‌ఆర్‌యూ యూనిట్లను వైర్లు కత్తిరించి చోరీ చేసేవారు. అనంతరం హైదరాబాద్‌లో విక్రయించి వచ్చిన డబ్బుతో విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేస్తూ జల్సాలకు ఖర్చు చేసేవారు.

Sthanikam

ఎయిర్‌టెల్ టవర్లే టార్గెట్‌.. ఇంజినీర్ల ముఠా అరెస్ట్!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి