తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ రమేష్ మేడి తండ్రి మేడి లింగయ్య మృతి పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంతాపం వ్యక్తం చేశారు.శనివారం హైదరాబాద్‌లోని మేడి లింగయ్య స్వగృహానికి విచ్చేసిన మందకృష్ణ మాదిగ, లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రియదర్శిని రమేష్ మేడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
లింగయ్య మృతి చెందిన రోజు, సంతాప దినాల్లో ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కారణంగా రాలేకపోయానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మేడి లింగయ్య గొప్ప సామాజికవేత్త, మానవతావాది అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజానికి సేవ చేయాలని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి