మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలల ప్రత్యేక గ్రామసభను ఘనంగా నిర్వహించారు. గ్రామ కార్యదర్శి ఎన్. అనిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు వక్కంతుల భరత్ బాబు మాట్లాడుతూ.. గ్రామంలోని బాలలందరికీ ఎలాంటి వివక్ష లేకుండా నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, పౌష్టికాహారం, రక్షణ కల్పించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గ్రామ అభివృద్ధి, స్థానిక పాలనలో బాలల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని వివరించారు. బాలబాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బాలల సమస్యలను వ్యక్తిగత సమస్యలుగా కాకుండా గ్రామ అభివృద్ధి, సుపరిపాలనలో భాగంగా పరిగణిస్తూ సమావేశంలో 16 తీర్మానాలు ఆమోదించారు. అనంతరం బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ యమునా లింగరాజు, వార్డు సభ్యులు వీరబాబు, మైసమ్మ జ్యోతి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక గ్రామసభ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి