ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ‘స్వపరిపాలన దినోత్సవం’ అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులే పరిపాలనా పగ్గాలు చేపట్టి అధికారులుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నారు.కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థిని శ్రీవైష్ణవి జిల్లా కలెక్టర్‌గా, పి. ప్రసన్న జిల్లా విద్యాశాఖాధికారి, కె. గౌతమ్ మండల విద్యాశాఖాధికారి, జి. భాగ్యశ్రీ ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించి పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎలిజబెత్, ఉపాధ్యాయులు అశోక్, సుజన, పురుషోత్తం రెడ్డి, ఇందుమతి, తేజస్వి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి