Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కళ్యాణోత్సవ ఆహ్వానం

Updated : 14 Nov 2026 12:50 IST
As Preferred Source 1 min read
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కళ్యాణోత్సవ ఆహ్వానం

భువనగిరి పట్టణంలో ఈ నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఆలయ కమిటీ చైర్మన్, భువనగిరి మాజీ ఎంపీపీ తోటకూరి వెంకటేష్ యాదవ్, 12వ వార్డు కౌన్సిలర్ తోటకూరి విజయలక్ష్మి తదితరులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ నెల 17న ఉదయం 11 గంటలకు అమ్మవారి కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.

Sthanikam

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కళ్యాణోత్సవ ఆహ్వానం

Article Image

భువనగిరి పట్టణంలో ఈ నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఆలయ కమిటీ చైర్మన్, భువనగిరి మాజీ ఎంపీపీ తోటకూరి వెంకటేష్ యాదవ్, 12వ వార్డు కౌన్సిలర్ తోటకూరి విజయలక్ష్మి తదితరులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ నెల 17న ఉదయం 11 గంటలకు అమ్మవారి కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి