మీనాక్షి నటరాజన్‌కు బాధ్యతల నుంచి విముక్తి.. తక్షణమే అమల్లోకి కొత్త నియామకం.
న్యూఢిల్లీ, నవంబర్ 14: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా బీఎం సందీప్‌ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం అధికారికంగా ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు బీఎం సందీప్‌ను తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ సేవలను పార్టీ అభినందిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా నియామకంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేచినట్లయింది. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వంతో సమన్వయం, పార్టీ సంస్థాగత బలోపేతం వంటి అంశాల్లో కొత్త ఇన్‌ఛార్జ్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి