Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

చిన్నారుల కేరింతలతో మార్మోగిన సెయింట్ ఎలిజబెత్ కాన్వెంట్!

Updated : 14 Nov 2026 17:18 IST
As Preferred Source 1 min read
చిన్నారుల కేరింతలతో మార్మోగిన సెయింట్ ఎలిజబెత్ కాన్వెంట్!

ఆటపాటలు, నృత్యాలతో బాలల దినోత్సవ వేడుకలు.. ప్రత్యేక ప్రదర్శనలతో అలరించిన ఉపాధ్యాయులు.

భువనగిరి, నవంబర్ 14:

భువనగిరి పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల సెయింట్ ఎలిజబెత్ కాన్వెంట్ (ఈ.ఎం.) హైస్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ రెవ. సిస్టర్ లాలీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. తమలోని ప్రతిభను చాటుకుంటూ తోటి విద్యార్థులను అలరించారు.

విద్యార్థుల్లో ఆనందోత్సాహాలు నింపేందుకు ఉపాధ్యాయులు సైతం ప్రత్యేక వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపాధ్యాయుల ప్రదర్శనలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో పాఠశాల ఆడిటోరియం పండుగ వాతావరణాన్ని తలపించింది.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రెవ. సిస్టర్ లాలీ మాట్లాడుతూ.. బాలలే దేశ భవిష్యత్తు అని, ప్రతి విద్యార్థిలోనూ ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని అన్నారు. విద్యతో పాటు సృజనాత్మకత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించి వారిని ప్రోత్సహించడం పాఠశాల బాధ్యతగా పేర్కొన్నారు.

సిస్టర్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది సమష్టి కృషితో వేడుకలు విజయవంతమయ్యాయి. విద్యార్థుల ప్రదర్శనలను ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, సిస్టర్స్, ఉపాధ్యాయులు అభినందించారు.

Sthanikam

చిన్నారుల కేరింతలతో మార్మోగిన సెయింట్ ఎలిజబెత్ కాన్వెంట్!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి