80 ఏళ్ల వయసులో తుదిశ్వాస.. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.
హైదరాబాద్, నవంబరు 14: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ సినీ నటుడు గిరిబాబు (80) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.
1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. 1973లో విడుదలైన 'జగమే మాయ' చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తొలినాళ్లలో హీరోగా నటించిన ఆయన అనంతరం విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి