విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన డాక్టర్ బి. సూర్యనారాయణ రెడ్డి
విద్యార్థి దశలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వంతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ అలవడతాయని జీనియస్ హైస్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ బి. సూర్యనారాయణ రెడ్డి అన్నారు.
నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు శనివారం పాఠశాల ఆవరణలో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విజేతలకు బంగారు, వెండి పతకాలతో పాటు ట్రోఫీలను ప్రదానం చేసి అభినందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి. సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడంతో పాటు ఓటమిని అధిగమించి మరింత పట్టుదలతో ముందుకు సాగేందుకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
పాఠశాల చైర్మన్ పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. చదువుతో పాటు వ్యాయామం, యోగాను నిత్యం సాధన చేయడం వల్ల విద్యార్థుల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, మేధో వికాసం మెరుగుపడతాయని తెలిపారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వి. సుచరిత, ఏవో జి. రవి, కోఆర్డినేటర్లు విజయ, పద్మావతి, ఫాతిమా, జయరాణి, సునీత రాణి, జయచిత్ర ప్రసాద్, పీఈటీలు కె. శ్రీకాంత్, కె. కృష్ణ, జి. వనజ, కె. మౌనిష తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి