విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన సర్పంచ్ దంపతులు
భువనగిరి రూరల్, నవంబర్ 14: స్థానికం ప్రతినిధి:
భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్, శ్రీనివాస్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సర్పంచ్ సూచించారు. బాలికలు విద్యతో అన్ని రంగాల్లో రాణించాలని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన పెంచుకొని వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల బాధ్యత కీలకమని పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల శాశ్వత దాత, ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, ప్రధానోపాధ్యాయులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి