Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

విశాల భారతి పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Updated : 14 Nov 2026 19:52 IST
As Preferred Source 1 min read
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

వ్యర్థ పదార్థాలతో వస్త్రధారణ.. ఆకట్టుకున్న విద్యార్థులు

దేశ నాయకుల వేషధారణ, నృత్య ప్రదర్శనలతో సందడి

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

స్థానిక విశాల భారతి హైస్కూల్‌లో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వ్యర్థ పదార్థాల (వేస్ట్ మెటీరియల్)తో తయారు చేసిన వినూత్న వస్త్రధారణతో పాటు, వివిధ దేశ నాయకుల గెటప్‌లలో మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి.​కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ప్రేమ అని, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. దేశానికి నెహ్రూ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

విశాల భారతి పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి