పిల్లల హక్కులు, విద్యపై అవగాహన కల్పించిన సర్పంచ్ వసంత నగేష్ గౌడ్
నెహ్రూ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వేడుకలు
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి (బాలల దినోత్సవం) పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం బాలల కోసం ప్రత్యేక గ్రామసభను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి దేశ భావి భారత పౌరులని, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, బాలల హక్కులు, పోషకాహారం, పరిశుభ్రత తదితర అంశాలపై విద్యార్థులతో నేరుగా చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పాలమాకుల కవిత నర్సింగ్, పాలమాకుల నవ్య నర్సింహా, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి బావండ్లపల్లి రాజు, బుట్టి సత్యం, పంచాయతీ కార్యదర్శి స్వరూప, ప్రధానోపాధ్యాయులు గిర్డర్ బాబు, ఉపాధ్యాయురాలు సుజాత, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి