Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా బీజేవైఎం నిరసన దిష్టిబొమ్మ దహనం.. యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.

Updated : 14 Nov 2026 15:59 IST
As Preferred Source 1 min read
రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా బీజేవైఎం నిరసన దిష్టిబొమ్మ దహనం.. యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.

భువనగిరి, నవంబర్ 14: స్థానికం ప్రతినిధి:

హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు హాజరైన రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా బీజేవైఎం భువనగిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని వినాయక చౌరస్తా వద్ద బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు మామిడోజు పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, యువమోర్చా ప్రభారి మయా దశ్రత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి, గో బ్యాక్ రాహుల్ గాంధీ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మయా దశ్రత మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలులో జాప్యం జరుగుతోందని విమర్శించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ మెస్ ఛార్జీలు సకాలంలో విడుదల చేయాలని కోరారు. తెలంగాణ యువత, విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ స్పందించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ భువనగిరి పట్టణ అధ్యక్షుడు రత్నాపురం బలరాం, 19వ వార్డు కౌన్సిలర్ జెర్రిపోతుల స్వర్ణలత, జిల్లా మీడియా కన్వీనర్ ఆకుతోట రామకృష్ణ, మంగు నర్సింహారావు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కుంకుంట్ల రమేష్, ఎరుపుల శివ, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గాయపాక పృథ్వీ, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాలశంకర్, ఓబీసీ మోర్చా నాయకుడు నాగరాజు, ఎదుగాని సంతోష్, జెర్రిపోతుల భరత్, రత్నాపురం ప్రవీణ్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లారం మధు, పాక మహేష్, వాస సాయి చరణ్, మనీష్, గొర్ల ఆనంద్, మర్రి శివ, బొమ్మ భాను, ఉదయగిరి సందీప్, పవన్, మేడబోయిన సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి