సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలో శుక్రవారం జరిగిన దొంగతనం కేసును చెదించారు జోగిపేట పోలీసులు. మన్సాన్ పల్లి గ్రామానికి చెందిన పిట్ల శ్రీశైలం ఇంట్లో 30వ తేదీ శుక్రవారం నాడు పట్టపగలు దొంగతనం జరిగింది. ఇల్లు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, 30 తులాల వెండి 8 వేల నగదు అపహరించారు. ఈ విషయంపై జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం ను రప్పించి కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత గ్రామానికి చెందని ఒక అనుమానాస్పద వ్యక్తి బైక్ పై అటుగా వెళ్లినట్టు గుర్తించారు. ఈ వ్యక్తి ఫోటోతో ఎవరు అని గ్రామంలో ఆరా తీయగా ఎవరు గుర్తుపట్టలేదు కానీ చివరకు దొంగతనం జరిగిన ఇంటి యజమాని అయిన పిట్ల శ్రీశైలం ఆ దొంగను తన అక్క కొడుకు అయిన తన మేనల్లుడు రంగంపేట గ్రామానికి చెందిన సారా చంద్రశేఖర్ గా గుర్తించారు. శుక్రవారం నాడు ముస్లాపూర్ గ్రామంలో బంధువుల శుభకార్యానికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరు అని గుర్తించిన శ్రీశైలం మేనల్లుడు సారా చంద్రశేఖర్ మన్సాన్ పల్లి గ్రామానికి వెళ్లి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో రాయితో ఇంటి తాళాలను పగలగొట్టి ఇంట్లో ఉన్న రెండు బీరువాలను పగలగొట్టి అందులో ఉన్న 5 తులాల బంగారం 30 తులాల వెండి కడియాలు, 8 నగదు తీసుకొని పరారయ్యాడు. నిందితుడు పైన గతంలో ఫోక్సో కేసు కూడా నమోదు అయిందని పోలీసులు తెలిపారు. ఫోన్ కొనుక్కోవడానికి తండ్రిని డబ్బులు అడగగా నిరాకరించడంతో ఫోన్ కొనుక్కోవడానికి మరియు వీడియోగ్రఫీకి అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి కోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్టు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం నిందితున్ని అదుపులోనికి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
మామ సొత్తును దోచిన మేనల్లుడు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి