తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాల ప్రజలు,వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోదాడ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ జిలానీ షేక్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.లారీ అసోసియేషన్లు, ట్రాన్స్‌పోర్టర్లు, ఆటో, మోటార్ క్యాబ్ యూనియన్లు,పాఠశాల బస్సుల యజమానులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భారీ వర్షాలు, బలమైన గాలులు ఉన్న సమయంలో అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, నీటితో నిండిన రహదారులపై వాహనాలు నడపవద్దని సూచించారు.ఆటో, క్యాబ్ డ్రైవర్లు తక్కువ వేగంతో వాహనాలు నడుపుతూ, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పాఠశాల బస్సుల బ్రేకులు, టైర్లు, వైపర్లు, లైట్లను తనిఖీ చేయాలని, వరద నీరు ప్రవహించే రహదారులపై బస్సులను నడపకూడదని హెచ్చరించారు.
సాధారణ వాహనదారులు కూడా అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని ఎంవీఐ జిలానీ షేక్ విజ్ఞప్తి చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి