మురాసు తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సంజీవరెడ్డి సూచించారు.అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
ఈదురుగాలుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న సమయంలో వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి