చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లవేళలా సహకరించాలని నేలపట్ల సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్ కోరారు. చౌటుప్పల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)ని సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఈ ప్రాంతంలో ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను నాయకులు అభినందించారు. స్థానికంగా శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఐని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాలమాకుల నర్సింహా, వార్డు సభ్యురాలు పాలమాకుల కవిత నర్సింహ, చప్పిడి సంజీవ రెడ్డి, మండల నాయకులు బాలగోని మల్లేష్ గౌడ్, పబ్బతి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి