Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

తండ్రి అమ్మిన భూమిపై కన్నేసిన కొడుకుల దురాగతం!

Updated : 21 Oct 2026 16:52 IST
As Preferred Source 1 min read
తండ్రి అమ్మిన భూమిపై కన్నేసిన కొడుకుల దురాగతం!

రూ.కోట్లు విలువ చేసే స్థలంపై అత్యాశ.. కోర్టు తీర్పు బేఖాతరు

భూమిని అమ్ముకున్నాక కూడా యజమానులపై దౌర్జన్యాలు, వరుస దాడులు

తాజాగా సరిహద్దు కడీల ధ్వంసం.. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

తండ్రి ఎప్పుడో చట్టబద్ధంగా విక్రయించిన భూమిపై ఆయన కుమారులు కన్నేశారు. భూముల ధరలకు రెక్కలు రావడంతో కలిగిన అత్యాశతో అందినకాడికి ఆక్రమించుకునేందుకు దుస్సాహసానికి ఒడిగడుతున్నారు. కోర్టు తీర్పులను సైతం బేఖాతరు చేస్తూ, కొనుగోలు చేసిన యజమానులపై వరుస దాడులకు తెగబడుతున్న ఘటన చౌటుప్పల్ రెవెన్యూ పరిధిలో కలకలం రేపుతోంది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... చౌటుప్పల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 336/ఉ/5 లో విస్తరించి ఉన్న 1-00 ఎకరం భూమిని మైలారం నర్సింహా అనే వ్యక్తి నుండి బొమ్మిడి నర్సిరెడ్డి 2003 సంవత్సరంలో (డీసీ నెం. 109/2003) క్రయవిక్రయాల ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. నాటి నుంచి ఆ భూమిపై పూర్తి హక్కులతో వారు ఉంటున్నారు. అయితే, కొద్ది కాలంగా ఆ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో విక్రేత కుటుంబ సభ్యుల కన్ను ఆ స్థలంపై పడింది. ​సదరు భూమిని సాగు నిమిత్తం చదును చేస్తుండగా, మైలారం నర్సింహా కుటుంబ సభ్యులు పలుమార్లు నర్సిరెడ్డిపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ వేధింపులపై నర్సిరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. కేసును విచారించిన సివిల్ కోర్టు 'ఓ.ఎస్. నంబర్ 231/2016' తీర్పు ద్వారా 2018 జూలై 30న నర్సిరెడ్డికి అనుకూలంగా శాశ్వత ఉత్తర్వులు (ఇంజంక్షన్ ఆర్డర్) జారీ చేసింది.​కోర్టు తీర్పు వెలువడిన తర్వాత నర్సిరెడ్డి భూమిని చదును చేసేందుకు వెళ్లగా, మైలారం నర్సింహా కుమారులు మరింత రెచ్చిపోయి ఆయనపై కిరాతకంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా చట్టబద్ధంగా హక్కులు పొందినప్పటికీ, భూమిని సాగు చేసుకునేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ నర్సిరెడ్డి కుటుంబంపై ప్రత్యర్థులు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.కొన్ని రోజుల క్రితం బొమ్మిడి నర్సిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి మరణానంతరం ఆయన కుమారుడు రామ్ మనోహర్ రెడ్డి ఆ భూమిని చదును చేసి రక్షణ కోసం సరిహద్దుల వద్ద కాంక్రీట్ కడీలు నాటారు. ఇది చూసి ఓర్వలేని మైలారం నర్సింహా కుమారులు మరింత దౌర్జన్యంగా వచ్చి ఆ కడీలను పూర్తిగా ధ్వంసం చేశారు.

​ఇప్పటికే మైలారం నర్సింహా కుటుంబంపై పలు సెక్షన్ల కింద పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదై ఉన్నాయి. తాజాగా మరోసారి ఆస్తి నష్టం కలిగించి, ప్రాణ భయానికి గురిచేస్తున్న మైలారం నర్సింహా కుమారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు రామ్ మనోహర్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

Sthanikam

తండ్రి అమ్మిన భూమిపై కన్నేసిన కొడుకుల దురాగతం!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news