Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

దసరాకే ఇలా ఉంటే.. సంక్రాంతికి ఈ రోడ్డులో పరిస్థితి ఏంటి? చెరుకు శివకుమార్ గౌడ్

Updated : 21 Oct 2026 14:18 IST
As Preferred Source 1 min read
దసరాకే ఇలా ఉంటే.. సంక్రాంతికి ఈ రోడ్డులో పరిస్థితి ఏంటి? చెరుకు శివకుమార్ గౌడ్

అధ్వాన్నంగా మారిన రహదారులు.. నరకయాతన పడుతున్న వాహనదారులు, స్థానికులు

​పట్టించుకోని అధికార యంత్రాంగంపై సర్వత్రా వ్యక్తమవుతున్న విమర్శలు

​చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

పండుగ వచ్చిందంటే చాలు ప్రజలు తమ సొంతూళ్లకు ప్రయాణమై వెళ్తుంటారు. సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాల్సిన పండుగ వేళ.. రోడ్ల దుస్థితి చూస్తే ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సరిగ్గా దసరా పండుగ రద్దీ సమయంలోనే రహదారులు అస్తవ్యస్తంగా మారుతుండటంతో, రాబోయే సంక్రాంతి నాటికి ఈ రోడ్ల పరిస్థితి మరింత ఎంత దారుణంగా తయారవుతుందోనని వాహనదారులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులు మొదలుకుని కాలనీ రోడ్ల వరకు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలు, తేలిపోయిన బీటీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. భారీ వర్షాలు, పెరిగిన రద్దీ కారణంగా రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. దసరా పండుగ కిక్కిరిసిన ట్రాఫిక్‌తో అల్లాడిపోతుంటే, మరోవైపు గుంతల రోడ్లపై ప్రయాణం చేయలేక వాహనదారులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు అపుడపుడే జారిపడి గాయాలపాలవుతున్నారు. కార్లు, ఇతర వాహనాలైతే సస్పెన్షన్ దెబ్బతిని రిపేర్లపాలవుతున్నాయి.

​రోడ్డు దుస్థితి కారణంగా కేవలం ప్రయాణికులే కాకుండా స్థానికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల్లో నిలిచిన వర్షపు నీరు, తేలే దుమ్ము-ధూళితో ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. రోడ్డు విస్తరణ పనులు, జంక్షన్ల మూసివేత వంటి అసంపూర్తి పనులు జనజీవితాన్ని మరింత అస్తవ్యస్తం చేశాయి. కాలినడకన వెళ్లే వృద్ధులు, పిల్లలు రోడ్డు దాటాలంటేనే భయపడిపోవాల్సిన దుస్థితి నెలకొంది. ​ఇప్పటికే దసరా పండగకే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే.. సంక్రాంతి నాటికి రద్దీ రెట్టింపు కావడం ఖాయం. అదే గనుక జరిగితే ఈ రోడ్లపై ప్రయాణం చేయడం సామాన్యులకు కలగానే మారే ప్రమాదముంది. ఇప్పటికైనా సంధ్యారాగం వీడి, సంబంధిత రోడ్లు మరియు భవనాల శాఖ (R&B) అధికారులు, స్థానిక యంత్రాంగం తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన గుంతలను పూడ్చి, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

దసరాకే ఇలా ఉంటే.. సంక్రాంతికి ఈ రోడ్డులో పరిస్థితి ఏంటి? చెరుకు శివకుమార్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి