Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

వనస్థలిపురం పోలీసుల మెరుపు వేగం.. మూడు రోజుల్లోనే కేసు ఛేదింపు!

Updated : 21 Oct 2026 15:53 IST
As Preferred Source 1 min read
వనస్థలిపురం పోలీసుల మెరుపు వేగం.. మూడు రోజుల్లోనే కేసు ఛేదింపు!

పెళ్లి ఖర్చుల కోసం చైన్‌ స్నాచింగ్‌.. ప్రేమజంట అరెస్ట్‌

30 గ్రాముల బంగారు గొలుసు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం

వనస్థలిపురం పోలీసుల పనితీరును అభినందించిన సీపీ సుమతి.

చైన్‌ స్నాచింగ్‌ కేసును మూడు రోజుల్లోనే ఛేదించి నిందితులను కటకటాల్లోకి పంపిన వనస్థలిపురం పోలీసులు! పెళ్లి ఖర్చుల కోసం చోరీకి పాల్పడిన ప్రేమజంటను అరెస్ట్‌ చేసి, వారి నుంచి 30 గ్రాముల బంగారు గొలుసు, రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వేగంగా స్పందించి కేసును ఛేదించిన పోలీసుల పనితీరును మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి అభినందించారు.

పెళ్లి కోసం నేరబాట

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మందడి గ్రామానికి చెందిన రమణారెడ్డి (23) గుర్రంగూడలో నివాసం ఉంటూ వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఉప్పం గ్రామానికి చెందిన తెంక వరలక్ష్మి (24) ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో వంట పని చేస్తోంది. వీరిద్దరూ గుర్రంగూడలో ఒకే ఇంట్లో అద్దెకు ఉంటూ సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరు, వివాహ ఖర్చులకు డబ్బులు సమకూర్చుకునేందుకు చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

పక్కా దర్యాప్తు.. నిందితుల అరెస్ట్‌

ఈ నెల 18న ఉదయం హస్తినాపురం వెంకటరమణ కాలనీలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం వద్ద జరిగిన చైన్‌ స్నాచింగ్‌ ఘటనపై వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆధారాలను సేకరించి నిందితులను గుర్తించి మూడు రోజుల్లోనే అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 30 గ్రాముల బంగారు గొలుసు, రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

తక్కువ సమయంలోనే కేసును ఛేదించి నిందితులను పట్టుకోవడం ద్వారా వనస్థలిపురం పోలీసులు తమ దర్యాప్తు వేగాన్ని చాటుకున్నారు. ఈ కేసు వివరాలను ఏసీపీ తాండ్ర కరుణాకర్‌రావు, వనస్థలిపురం సీఐ రవిబాబు వెల్లడించారు.

Sthanikam

వనస్థలిపురం పోలీసుల మెరుపు వేగం.. మూడు రోజుల్లోనే కేసు ఛేదింపు!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news