Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

పోలీసుల త్యాగనిరతిని కొనియాడిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

Updated : 21 Oct 2026 14:18 IST
As Preferred Source 1 min read
పోలీసుల త్యాగనిరతిని కొనియాడిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తారని, విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందిస్తారని అన్నారు.ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన జంగయ్య (సిర్గాపూర్ పోలీస్ స్టేషన్), ఎల్లయ్య (సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్),సత్యనారాయణ (జిన్నారం పోలీస్ స్టేషన్), సురేష్ (కంగ్టి పోలీస్ స్టేషన్) చేసిన ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ వారి ధైర్యసాహసాలను కొనియాడారు.అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం,జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పది మంది పోలీసు సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 154 మంది పోలీసు సిబ్బందిని స్మరించుకోవడం మనందరి బాధ్యతని, వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు పోలీసు సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో నక్సలిజం ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో ఎంతోమంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.సంగారెడ్డి జిల్లాకు చెందిన జంగయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, సురేష్ చేసిన ప్రాణత్యాగాలు పోలీసు శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నియంత్రణ,అంతర్గత భద్రత, ప్రభుత్వ ఆస్తుల రక్షణతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని కల్పించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ప్రజల రక్షణకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్,ఎస్పీ సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి,డీఎస్పీలు,సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోలీసుల త్యాగనిరతిని కొనియాడిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి