Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సేవలోనే స్మరణ.. మల్లేశం గౌడ్ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 07:12 PM

కంచరకుంట్ల కాలనీ కమ్యూనిటీ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసుల నిరసన

07-10-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ కేంద్రంలోని 12వ వార్డు పరిధిలోని కంచరకుంట్ల కాలనీకి చెందిన కమ్యూనిటీ స్థలాన్ని కబ్జా యత్నాల నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కంచరకుంట్ల కాలనీలో సుమారు 800 గజాల స్థలాన్ని కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించినట్లు వారు తెలిపారు.​ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు కోనేటి నరసింహ మాట్లాడుతూ.. 2003లో 30 ప్లాట్లతో ఏర్పాటైన వెంకట్ రెడ్డి వెంచర్‌కు, 2025లో 31, 32, 33, 34 నంబర్లతో కొత్త ప్లాట్లను జత చేసి సవరించిన లేఅవుట్‌ను ఎస్ఆర్ఓ కి సమర్పించారని తెలిపారు. ఈ విధంగా సుమారు 800 గజాల స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు. అసలు వెంచర్‌కు సుమారు 150 నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న కాలనీ కమ్యూనిటీ స్థలాన్ని, ఆ వెంచర్‌లో భాగంగా చూపించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు.2017లో కాలనీ ముఖద్వారం ఏర్పాటు చేసిన సమయంలో, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కాలనీ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచరకుంట్ల సత్తిరెడ్డి ఈ స్థలాన్ని విరాళంగా ఇచ్చారని స్థానికులు గుర్తుచేశారు. 2020-2025 మధ్యకాలంలో అక్కడున్న పాత వ్యవసాయ బావిని పూడ్చి, స్థలాన్ని చదును చేసి కాలనీ అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. ​అయితే, ఇటీవల రాత్రి వేళల్లో కంచరకుంట్ల రామ్‌రెడ్డి (తండ్రి: వెంకట్‌రెడ్డి) తన అనుచరులతో కాలనీలోకి వచ్చి, స్థానికులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. అడ్డుకునేందుకు వచ్చిన కాలనీవాసులు, మహిళలను దుర్భాషలాడుతూ భయాందోళనలకు గురిచేశారని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎస్‌ఐ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసి, ధ్వంసమైన సీసీ కెమెరాల దృశ్యాలను అధికారులకు చూపించినట్లు పేర్కిన్నారు.​ఈ కమ్యూనిటీ స్థలాన్ని రక్షించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, డీఎస్పీ, మున్సిపల్ చైర్మన్, అధికారులను కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు కోనేటి నరసింహ, చెరుకు వెంకటేష్, ముత్యాలు, మహేందర్, లక్ష్మీనారాయణ, అంజయ్య, జలంధర్, లక్ష్మారెడ్డి, కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, నరసింహ, జంగయ్యచారి, శ్రీకాంత్, యాదమ్మ, సుజాత, కమలమ్మ, సిరియాల తదితర కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కంచరకుంట్ల కాలనీ కమ్యూనిటీ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసుల నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News