Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఘనంగా పబ్బు అరుణ-రాజు గౌడ్ వివాహ వార్షికోత్సవ వేడుకలు

Updated : 22 Nov 2026 20:53 IST
As Preferred Source 1 min read
ఘనంగా పబ్బు అరుణ-రాజు గౌడ్ వివాహ వార్షికోత్సవ వేడుకలు

శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో స్వాములకు అన్నప్రసాద వితరణ

కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

‘అన్ని దానములందు అన్నదానమే మిన్న.. స్వాములకు చేసే అన్నదానం జన్మజన్మల పుణ్యఫలం’ అనే స్ఫూర్తితో శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయ సన్నిధానంలో నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. తోర్పునూరి నర్సింహ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఏడవ రోజు ఆదివారం మాలధారులైన అయ్యప్ప స్వాములకు మహా అన్నదానాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.​కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్ - అరుణ దంపతుల 29వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పవిత్ర సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ స్వాములకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. అనంతరం ఆలయ అర్చకులు, అయ్యప్ప స్వాములు దాతల కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ వేద ఆశీర్వచనాలు అందజేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో పిఏసిఎస్ ఛైర్మన్ మస్తాన్ బాబు, వైస్ ఛైర్మన్ పర్నె శివారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, సుర్వి నర్సింహ గౌడ్, కో-ఆప్షన్ సభ్యులు సందగల్ల విజయ సతీష్ గౌడ్, వర్కాల వెంకట్ కుమార్ గౌడ్, చెవగొని వెంకటేష్ గౌడ్, కళ్ళెం నాగరాజు, సుర్వి మహేష్ గౌడ్, తోర్పునూరి లింగస్వామి గౌడ్, దుబ్బాక ఆకాష్ రెడ్డి, ఉష్కగుల శ్రీశైలం గౌడ్, మామిడి శివకుమార్ గౌడ్ తదితర ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా పబ్బు అరుణ-రాజు గౌడ్ వివాహ వార్షికోత్సవ వేడుకలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news