చిట్యాల: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్నకాపర్తి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసి జమ్మి అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, వార్డు సభ్యులు ఈరమళ్ల దయాకర్, దేశపాక మధు, వలిగొండ సత్యనారాయణ, పల్లపు ప్రశాంత్, నందిపాటి మహేష్, బెల్లంకొండ రఘు, దేశపాక శ్రావణ్ పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి