మినీ వ్యాన్ ఢీకొనడంతో గౌస్ పాషా దుర్మరణం.
చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిట్యాల పట్టణానికి చెందిన గౌస్ పాషా మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌస్ పాషా ఉరుమడ్లలో తన పని ముగించుకుని బైక్పై ఆరెగూడెం వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వచ్చిన మినీ వ్యాన్ బైక్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో గౌస్ పాషా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. గౌస్ పాషా మృతితో చిట్యాల పట్టణంలో విషాదం నెలకొంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి