Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు.

15-10-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

భువనగిరి: పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భువనగిరి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. బొల్లేపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

రేషన్‌ కార్డు కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతోపాటు అర్హతను బట్టి వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. నూతన రేషన్‌ కార్డులు పొందిన కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గ్రామాభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు

బొల్లేపల్లి గ్రామ అభివృద్ధికి దాదాపు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి రేఖ బాబురావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడాలని కోరారు.

పలువురు ప్రజాప్రతినిధుల హాజరు

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ రమాదేవి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ గడ్డమీ వీరస్వామి గౌడ్‌, ఆత్మ కమిటీ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి, ఏసీఎస్‌ డైరెక్టర్‌ పాపమ్మ శంకరయ్య, వార్డు సభ్యులు సందెల మహేష్‌, వదిచర్ల కీర్తన సురేశ్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు గుండు కృష్ణ గౌడ్‌, భువనగిరి మండల కార్యదర్శి నల్గొండ ప్రభాకర్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కనకుంట్ల కొండల్‌, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు ముక్కిడి బాలయ్య, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు కనుకుంట్ల సురేశ్‌, ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్‌, కోశాధికారి బాలకృష్ణ, కార్యదర్శి యార్వ జంపయ్య, భువనగిరి పాండు, గడ్డం జంగయ్య, హరి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News