సంగారెడ్డి జిల్లాలో జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు.ఇందులో భాగంగా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్‌లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి, పేకాట ఆడుతున్న 13 మందిని పట్టుకున్నారు.వారి వద్ద నుంచి రూ.2,00,120 నగదు, 52 పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 24–25 తేదీల మధ్యరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో, జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్‌లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.దీంతో వెంటనే స్పందించిన హద్నూర్ ఎస్ఐ సుజిత్, జహీరాబాద్ టౌన్ పోలీసు సిబ్బందితో కలిసి సదరు గెస్ట్ హౌస్‌పై ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 13 మందిని పట్టుకొని, వారి వద్ద ఉన్న రూ.2,00,120 నగదు, 52 పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో జూదం, పేకాటతో పాటు ఇతర అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎలాంటి తావులేదని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో జూదం, పేకాట వంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఎస్పీ కోరారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.2,00,120 నగదు, 52 కార్డులు స్వాధీనం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి