సదాశివపేట పట్టణంలోని తెలంగాణ ప్రజాశక్తి పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పరిగి శ్రీనివాస్‌ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు దొడ్ల వెంకట్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దొడ్ల వెంకట్ మాట్లాడుతూ సామాన్య ప్రజలు సైతం రాజకీయాల్లోకి వచ్చి, చట్టసభలకు పోటీ చేసే అవకాశం తెలంగాణ ప్రజాశక్తి పార్టీలో ఉందని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీలో అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, కళ్యాణలక్ష్మి పథకం ద్వారా తులం బంగారం అందిస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఆ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూతన పట్టణ అధ్యక్షుడు పరిగి శ్రీనివాస్‌తో పాటు నవీన్, గాజుల కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజాశక్తి పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పరిగి శ్రీనివాస్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి