Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

సదాశివపేట కేజీబీవీలో విద్యార్థుల రోబోటిక్స్ ప్రతిభను పరిశీలించిన కలెక్టర్

Updated : 25 Nov 2026 18:20 IST
As Preferred Source 1 min read
సదాశివపేట కేజీబీవీలో విద్యార్థుల రోబోటిక్స్ ప్రతిభను పరిశీలించిన కలెక్టర్

విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో 2021లో ప్రారంభించిన రోబోటిక్స్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం తెలంగాణలోని 33 జిల్లాల్లో 1,006 పాఠశాలలకు ఈ కార్యక్రమం చేరగా, ఇప్పటివరకు 1.68 లక్షల మందికి పైగా విద్యార్థులకు రోబోటిక్స్, సాంకేతిక విద్యలో శిక్షణ అందించారు.ఈ సందర్భంగా 1,000 పాఠశాలల మైలురాయిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ప్రత్యేక రోబోటిక్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. రోహిణి, మండల విద్యాధికారి ఎన్. శంకర్, పాఠశాల ప్రత్యేక అధికారి లలిత, సోహం అకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్ సహదేవ్ కొమరగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన రోబోటిక్స్ నమూనాలు, వివిధ ప్రాజెక్టులను అధికారులు పరిశీలించి, వాటి పనితీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ ఆలోచనలు, ప్రయోగాల గురించి వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తిని పెంపొందిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వారి అవసరాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో రోబోటిక్స్ క్లబ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రత్యేక పరికరాలు, రోబోటిక్స్ కిట్లు అందిస్తున్నారు. వాటి సహాయంతో విద్యార్థులు స్వయంగా ప్రయోగాలు చేస్తూ రోబోటిక్ నమూనాలను తయారు చేయడం, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం నేర్చుకుంటున్నారు. దీనివల్ల వారిలో ఆలోచనా శక్తి, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు, బృందంగా పనిచేసే సామర్థ్యం పెరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. రాబోయే రోజుల్లో మరిన్ని పాఠశాలలకు రోబోటిక్స్ శిక్షణను అందించి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం ఆధునిక సాంకేతిక విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా సోహం అకాడమీ ముందుకు సాగుతోంది.

Sthanikam

సదాశివపేట కేజీబీవీలో విద్యార్థుల రోబోటిక్స్ ప్రతిభను పరిశీలించిన కలెక్టర్

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి