కోయలగూడెంలో రెండు నెలల శిక్షణ ప్రారంభం
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చేనేత అనుబంధ రంగాలైన గ్రాఫ్ డిజైనింగ్, టై అండ్ డై (ప్రీలూమ్) ప్రక్రియల్లో నైపుణ్యం సాధించడం ద్వారా మహిళలు ఇంటి వద్ద నుండే మెరుగైన ఆదాయం పొందవచ్చని పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం పేర్కొన్నారు. గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, పెర్నోడ్ రికార్డ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు నెలల ‘ప్రీలూమ్’ శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం ఆయన కోయలగూడెంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. చేనేత రంగంలో వస్తున్న ఆధునిక మార్పులకు అనుగుణంగా మహిళలు నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. శిక్షణ విధివిధానాలు, భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. తొలుత యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ సతీష్ ఆరుకొండ మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం తమ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ లీడ్ దిలీప్ కుమార్, శిక్షకుడు చిట్టిమిల్ల శ్రీనివాస్, మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి