ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు ప్రతి సంవత్సరం నవంబర్ 27వ తేదీన అంతర్జాతీయ బాల్య దశలో, బలవంతపు బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ రోజు నుండి 100 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఇందులో భాగంగా 25-11-2026వ తేదీన రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కదిరి మండలం, కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ, గంగన్నగారిపల్లి నందు అంతర్జాతీయ బాల్య దశలో మరియు బలవంతపు బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం దెబ్బతింటుందని, ఇది ఒక సామాజిక సమస్య అని తెలిపారు. బాల్య వివాహాలు ఆపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రభుత్వ అధికారులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు.అనంతరం హాజరైన వారితో మేము బాల్య వివాహాలు చేయమని, చేసేవారిని ఆపుతామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి భార్గవ, మండల నాయకులు, మాజీ సర్పంచ్ గంగులప్ప, రఘు, గంగులప్ప, రెడ్స్ కార్యకర్తలు రాధ, గ్రామస్తులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి