సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలం బర్దిపూర్ గ్రామ శివారులో బుధవారం (నవంబర్ 25) ఉదయం సుమారు 10 గంటల సమయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బేగరి సమ్మయ్య (75), తండ్రి నర్సప్ప, రోజువారీ కూలీగా చెరుకు పొలంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో చెరుకు కోత యంత్రం వెనుక ట్రాక్టర్ వద్ద పని చేస్తుండగా, ట్రాక్టర్ డ్రైవర్ వెనుక ఉన్న సమ్మయ్యను గమనించకుండా ట్రాక్టర్‌ను వెనక్కి నడిపాడు. దీంతో ట్రాక్టర్ సమ్మయ్యపై ఎక్కడంతో ఆయన తలకు తీవ్ర గాయాలై ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంపై మృతుడి కుమారుడు బేగరి నరసింహులు (42) పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చెరుకు కోత పనుల్లో విషాదం.. ఘటనాస్థలంలోనే వృద్ధుడి మృతి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి