Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / జహీరాబాద్

ప్రజలే ప్రాధాన్యం.. యువతే బలం.. గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు

Updated : 25 Nov 2026 19:48 IST
As Preferred Source 1 min read
ప్రజలే ప్రాధాన్యం.. యువతే బలం.. గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు

రాజకీయాలు అంటే కేవలం పదవులు, హోదాలు మాత్రమే కాదు.. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం కృషి చేయడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం. అలాంటి లక్ష్యంతో ప్రజల మధ్య ఉంటూ, యువతకు అందుబాటులో ఉంటూ జహీరాబాద్ ప్రాంతంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నాయకుడు గోవర్ధన్ రెడ్డి.యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన యువతతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తనవంతుగా స్పందిస్తూ,వారి సమస్యలను సంబంధిత నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ప్రజలకు ఎదురయ్యే సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారం కోసం ప్రయత్నించడం నాయకుడి బాధ్యతగా భావిస్తూ గోవర్ధన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అభిమానులు చెబుతున్నారు. నేటి సమాజంలో యువతకు రాజకీయ, సామాజిక రంగాల్లో మంచి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని భావిస్తూ, యువతను ఐక్యం చేయడం, వారి సమస్యలను ముందుకు తీసుకెళ్లడం, సామాజిక కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పదవులు, హోదాల కంటే ప్రజలతో ఏర్పడిన అనుబంధం, వారి అభిమానాన్ని సంపాదించుకోవడమే ముఖ్యమనే ఆలోచనతో ప్రజలకు అందుబాటులో ఉంటూ తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా యువతకు అండగా నిలుస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో తనవంతు పాత్ర పోషించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. యువతతో అనుబంధం, ప్రజలతో సాన్నిహిత్యం, సామాజిక సేవ పట్ల ఆసక్తితో జహీరాబాద్ ప్రాంతంలో యువ నాయకుడిగా గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

Sthanikam

ప్రజలే ప్రాధాన్యం.. యువతే బలం.. గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి