ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు పేర్కొన్నారు. బుధవారం చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 17వ వార్డులో కోట్ల పారిజాత-సాయికిరణ్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆమె భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పురపాలక సంఘం చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్‌ల సహకారంతో లబ్ధిదారులకు ఇల్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు. సామాన్య మానవుడు ఇల్లు లేకుండా ఉండకూడదన్న సంకల్పంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో నియోజకవర్గంతో పాటు చౌటుప్పల్ పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతోందని, చైర్మన్ పావని రమేష్ గౌడ్ సహకారంతో 17వ వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరమల్ల సత్తయ్య గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముత్యాల మహాలక్ష్మి, లబ్ధిదారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి