Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం: మూడో తరగతి విద్యార్థి దుర్మరణం

Updated : 24 Nov 2026 20:44 IST
As Preferred Source 1 min read
చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం: మూడో తరగతి విద్యార్థి దుర్మరణం

చౌటుప్పల్‌ వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద ఘటన

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తున్న ఎనిమిదేళ్ల బాలుడిని అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన యాదాద్రి చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద సోమవారం రాత్రి జరిగింది.​పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాంజనేయ తండాకు చెందిన భూక్య శ్రీనుకు ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు కవల కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడైన శ్రీచరణ్‌(8)ను చదువు నిమిత్తం చౌటుప్పల్‌లో నివాసం ఉంటున్న తన పెద్దనాన్న భూక్య వాసు వద్ద ఉంచారు. బాలుడు స్థానికంగా ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు.​సోమవారం రాత్రి 8 గంటల సమయంలో శ్రీచరణ్ తన పెద్దమ్మ దీపికతో కలిసి వలిగొండ రోడ్డులోని ఆలయానికి వెళ్లాడు. దర్శనం అనంతరం రాత్రి 9:05 గంటల సమయంలో తిరిగి ఇంటికి వస్తూ వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా, అజాగ్రత్తగా వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన బొలెరో మ్యాక్స్ వాహనం బాలుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీచరణ్ తల, మెడ భాగాల్లో తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.అల్లారుముద్దుగా పెంచుకున్న కవల పిల్లల్లో ఒకరు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బాలుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు బొలెరో డ్రైవర్ విజయ్ చవాన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం: మూడో తరగతి విద్యార్థి దుర్మరణం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి