కోదాడ పట్టణంలోని పలు మైదానాల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయపు నడకకు వచ్చిన యువత, పట్టభద్రులు, స్థానిక ప్రజలను కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యావంతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాకేష్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. పట్టభద్రులు, నిరుద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని బొల్లం మల్లయ్య యాదవ్ విజ్ఞప్తి చేశారు.
ఉదయపు నడకతో పట్టభద్రులతో మమేకమైన బొల్లం, రాకేష్ రెడ్డి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి