Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ప్రజల భద్రతకు పోలీసుల భరోసా.. సైబర్ నేరాలపై అవగాహన

Updated : 25 Nov 2026 21:26 IST
As Preferred Source 1 min read
ప్రజల భద్రతకు పోలీసుల భరోసా.. సైబర్ నేరాలపై అవగాహన

సైబర్ నేరాలు, దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సంజీవరెడ్డి సూచించారు. మునగాల మండలం సీతానగరం గ్రామంలో బుధవారం పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం, గుర్తుతెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల సైబర్ మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అదేవిధంగా ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విలువైన వస్తువుల భద్రతపై శ్రద్ధ వహించాలని తెలిపారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రత, సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీరయ్య, ఉపసర్పంచ్ ఎల్లయ్య, సీనియర్ రిపోర్టర్ పడిశాల నాగరాజు, లెక్కల సుధాకర్, విద్యార్థి సంఘం నాయకుడు పుల్లూరి సింహాద్రి, పుల్లూరి శివాజీ, పడిశాల ఉదయ్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల భద్రతకు పోలీసుల భరోసా.. సైబర్ నేరాలపై అవగాహన

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి