Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

Updated : 24 Nov 2026 20:09 IST
As Preferred Source 1 min read
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

కోదాడలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ..ఉద్యోగ విరమణ అనంతరం పెన్షనర్లు పలు ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, వైద్య సదుపాయాలు, పాత పెన్షన్ విధానం వంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదన్నారు. పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సంఘం ప్రతినిధులను కోరారు.

Sthanikam

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

Article Image

కోదాడలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ..ఉద్యోగ విరమణ అనంతరం పెన్షనర్లు పలు ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, వైద్య సదుపాయాలు, పాత పెన్షన్ విధానం వంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదన్నారు. పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సంఘం ప్రతినిధులను కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి