కోటి వత్తుల దీపాలు వెలిగించిన ఉపాధ్యాయులు
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ హైస్కూల్లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం కోటి దీపోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో కోటి వత్తుల దీపాలను వెలిగించి కార్తీక సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చౌటుప్పల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి సంధ్యారాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్తీక మాసంలో దీపారాధన ఎంతో విశిష్టమైనదని, ఈ దీపాల కాంతులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ కె.వి.బి. కృష్ణారావు, మహిళా ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి